రష్యాతో భారత్కు ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్నేహం చమురు సరఫరా నుంచి S-400 క్షిపణి వ్యవస్థల వరకు వివిధ ఒత్తిళ్లను తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. రష్యా అన్ని విషయాల్లో భారత్ పక్షాన నిలిచిందన్నారు. కీలక సమయంలో పుతిన్ పర్యటన జరుగుతోందని వెల్లడించారు.