NTPT: ఊట్కూరు మండలంలో 3 వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఊపందుకుంది. గురువారం ఒక్కరోజే 40 సర్పంచ్,131 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు మొత్తం 54 సర్పంచ్,141 వార్డు నామినేషన్లు నమోదయ్యాయి. అభ్యర్థులు ముహూర్తానికి రావడంతో నామినేషన్ల స్వీకరణ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది.