W.G: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం జంగారెడ్డిగూడెం డిపోను సందర్శించిన ఆయన మాట్లాడారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో సొంత, అద్దె బస్సులను ప్రవేశపెడతామన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.