MDK: రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సీఐటీయీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ.. జిల్లా ఉపాధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.