MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ముస్కుల శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతుల సమస్య పరిష్కరిస్తానని, గ్రామం సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేస్తానని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.