W G: నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ -2 తాండవం’ చిత్రం ప్రీమియర్ షోలు రద్దు కావడంతో జిల్లాలోని బాలయ్య అభిమానులు నిరాశ చెందారు. గురువారం రాత్రి 09:36 నిమిషాలకు ప్రీమియర్ షోలకు సర్వం సిద్ధం అయ్యాక సాంకేతిక కారణాలతో ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహం చెందారు.