MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా 3వ విడత నామినేషన్ల స్వీకరణ రెండవ రోజున నామినేషన్లు భారీగా దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 81 నామినేషన్లు వచ్చాయి. బాలనగర్ మండలంలో 68 నామినేషన్లు, భూత్పూర్ మండలంలో 44 నామినేషన్లు, మూసాపేట మండలంలో 19 నామినేషన్లు, అడ్డాకులలో 37 దాఖలయ్యాయి. 2వ రోజున 249 మొత్తంగా 330 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు.