MDK: నిజాంపేట్ మండలం జమ్మికుంట గ్రామ శివారులోని రోడ్డు పక్కన గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరణించిన వ్యక్తి పూర్తి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.