NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డిండి మండలం రహమంతాపురం గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.