భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోదీ భగవద్గీతను అందజేశారు. అయితే పుతిన్‌కి ఇచ్చిన భగవద్గీత రష్యన్ భాషలో ముద్రించారు. ఈ సందర్భంగా గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. కాగా నిన్న రాత్రి ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌లో పుతిన్‌కి మోదీ ప్రత్యేక డిన్నర్‌ను ఏర్పాటు చేశారు.