పాక్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా మునీర్‌ను నియమిస్తూ ఆ దేశ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగిస్తున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు అసిఫ్ అలీ వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేశారు.