VZM: మాజీ సీఎం జగన్పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఇవాళ కలక్టరేట్లో DRC సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం జగన్కు అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 16 నెలల కాలంలో 16 రోజులైనా వరుసగా ఆయన ఏపీలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా ఇలా ఆంద్రాకు వచ్చి అలా వెళ్లిపోతుంటారని విమర్శించారు.