KMM: సత్తుపల్లి(M) రుద్రాక్షపల్లి, గంగారాం, బేతుపల్లి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఇవాళ ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఏసీపీ స్వయంగా పరిశీలించారు. నామినేషన్ సంధర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు.