ADB: గ్రామాలను అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి అడ్డుకునే వారు, పంచాయతీలు పెట్టే వారితో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలకు హితవు పలికారు. ఏకగ్రీవం చేసుకునే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తామని అన్నారు.