KDP: పులివెందులలోని స్థానిక అంకాలమ్మపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు అందించాల్సిన ఆహారం, సేవలలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో అవకతవకులు జరగకుండా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.