GDWL: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కోసం ఖరారు చేసిన రిజర్వేషన్లను పరిశీలించి, అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన ఎర్రవల్లి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ భవనంలో ఏర్పాటు చేసిన క్లస్టర్- 1, క్లస్టర్- 2 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.