HYDలో హార్దిక్ ఫాలోయింగ్ దెబ్బకు ఏకంగా SMAT బరోడా vs గుజరాత్ మ్యాచ్ వేదికను ఉప్పల్‌కు మార్చేశారు. వాస్తవానికి ఈ మ్యాచ్ జింఖానా మైదానంలో జరగాల్సి ఉంది. అయితే DEC 2న బరోడా vs పుదుచ్చేరి మ్యాచ్‌లో హార్దిక్ కోసం ఓ అభిమాని గ్రౌండ్లోకి దూసుకొచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేదికను మార్చారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.