WNP: మోజర్ల ఉద్యాన కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు భాస్కర్ ఆధ్వర్యంలో పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు వ్యవసాయ, ఉద్యాన, వెటర్నిటీ, పశు వైద్య ఇతర వ్యవసాయ అనుబంధ కోర్సులలో ఎలా ప్రవేశం పొందాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జగదీష్ బాబు పాల్గొన్నారు.