E.G: రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, దీర్ఘకాలిక వ్యాధుల కోసం అవసరమైన ఓపీడీ సేవలను ఆయుష్మాన్ భారత్ పథకంలో తక్షణమే చేర్చాలని పార్లమెంటులో కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో, రూల్ 377 ప్రకారం ఆసుపత్రుల్లో ఔషధాల కవరేజీని 15 రోజుల పరిమితిని దాటి మరింత కాలానికి విస్తరించాలని, తద్వారా ప్రజల అదనపు ఖర్చులను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.