World No Tobacco Day: నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
31 మే 2023న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం(anti tobacco day). ఈ సంవత్సరం 2023 థీమ్(theme) “మనకు ఆహారం కావాలి, పొగాకు కాదు”. దీంతోపాటు పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ అవకాశాల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యం. పొగాకు వ్యతిరేక దినోత్సవం ద్వారా వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలకు పొగాకు వినాశకరమైన ప్రభావం గురించి గుర్తుచేయనున్నారు.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం(anti tobacco day) ఈరోజు మళ్లీ వచ్చింది. ఈ సంవత్సరం 2023 థీమ్ ‘మనకు ఆహారం కావాలి, పొగాకు కాదు’. పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం దీనిని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం అని కూడా పిలుస్తారు. ఇది పొగాకు వినియోగం వల్ల వచ్చే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్నారు. పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన విధానాలను సూచించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేతృత్వంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.
పొగాకు వ్యతిరేక దినోత్సవం లక్ష్యం ధూమపానం, పొగలేని పొగాకు ఉత్పత్తులతో సహా పొగాకు వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఇది పొగాకు మానేయడం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. పొగాకు నియంత్రణను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు, ప్రచారాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలలో ప్రజల అవగాహన ప్రచారాలు, పాఠశాలలు, కమ్యూనిటీలలో విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. పొగాకు వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు తెలియజేయడం, యువత పొగాకు అలవాట్లను ప్రారంభించకుండా నిరోధించడంపై దృష్టి కేంద్రీకరించబడింది.
1987లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ WHA40.38 తీర్మానాన్ని ఆమోదించింది. ఏప్రిల్ 7, 1988న ప్రపంచ ధూమపాన నిరోధక దినంగా పాటించాలని మొదట పిలుపునిచ్చారు. ఆ తర్వాత 1988లో WHA42.19 తీర్మానం ఆమోదించబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అంచనా ప్రకారం ప్రతిరోజు దాదాపు 1,600 మంది యువకులు తమ మొదటి సిగరెట్ కోసం ప్రయత్నిస్తారు.