ASF: పెంచికల్పేట్ మండలంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఒడ్డుగూడ మధ్యలోని పెద్దవాగు ఒడ్డున పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం 4 వరకు ఇళ్లకు చేరుకోవాలన్నారు.