MBNR: జనాభా ప్రాతిపదికన బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ను ఓసీలకు కట్టబెట్టారని బీసీ సమాజ్ రాష్ట్ర కార్య దర్శి శ్రీనివాస్ సాగర్ ఆరోపించారు. బుధవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.