AP: గంజాయి మాఫియాకు బలైన సీపీఎం నేత పెంచలయ్య కుటుంబసభ్యులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పెంచలయ్య కుటుంబానికి రూ.10 లక్షలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుమారుల్లో ఒకరిని ఐఏఎస్, మరొకరిని ఐపీఎస్ చేయాలనేది పెంచలయ్య కోరిక అని పేర్కొన్నారు. పెంచలయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.