SKLM: అమదాలవలస నియోజకవర్గంలోని పలు మండలాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి సతీమణి, పొందూరు మాజీ ఎంపీపీ శ్రీమతి కూన ప్రమీలా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందించారు. దన్నాన రేయమ్మ రూ. 43,000 మొరకన దాలి గురువులు రూ. 1,12,000 జోగి ఉపేంద్ర రూ. 24,000 అందజేసినట్లు తెలిపారు.