దేశ రాజధాని ఢిల్లీలోని రెండు కాలేజీలకు బాంబు బెదింపు మెయిల్ వచ్చింది. రాంజాస్, దేశ్‌బంధు కాలేజీలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబ్ స్క్వాడ్, పోలీసులు కాలేజీల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు మెయిల్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.