JGL: రాష్ట్ర ఎస్సీఆర్టీ డైరెక్టర్ జీ. రమేష్ బీర్పూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి ప్రత్యేక తరగతులను ఆకస్మికంగా పర్యవేక్షించారు. విద్యార్థులతో మాట్లాడి ఎస్సెస్సీ ప్రణాళికను వివరించి, ప్రత్యేక తరగతులను వినియోగించుకోవాలని సూచించారు. గత సంవత్సరం పాఠశాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన విషయాన్ని అభినందించారు.