KDP: వల్లూరు మండలం గోటూరు టోల్ గేట్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీకి చెందిన సుబ్బరాయుడు నడుపుతున్న ఆటో, కమలాపురం వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం కడపకు తరలించారు.