PLD: నరసరావుపేట మండలం జొన్నలగడ్డకు చెందిన నామెపల్లి మహంకాళేశ్వరరావు(26) అదృశ్యమైనట్లు యడ్లపాడు పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. గత నెల 23న బోయపాలెం బాబా స్టోన్ క్రషర్స్కు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. తండ్రి బ్రహ్మం ఫిర్యాదుతో ఎస్ఐ శివరామకృష్ణ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.