TG: నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న బిక్కిన కొండలరావును అధికారులు మూడో రోజు కస్టడీకి తీసుకున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకోగానే ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడికల్ టెస్టులు పూర్తయ్యాక విచారణ జరిపి, మరిన్ని నిజాలు రాబట్టనున్నారు.