KDP: ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డి నగర్‌కు చెందిన మధుసూదన్ తన భార్య సాయిరూప కనిపించడం లేదని మంగళవారం స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్న ఈ దంపతులకు సంతానం లేదనే మనోవేదనతో సాయిరూప సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.