W.G: ప్రభుత్వం మహిళల జీవన ప్రమాణాలను పెంచేందుకు అమలు చేస్తున్న డ్వాక్రా స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు పారదర్శకంగా ఉండాలని సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ అన్నారు. నరసాపురంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, బ్యాంకర్లు, సిబ్బందికి మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ‘మనడబ్బులు -మన లెక్కలపై అవగాహన’ కల్పించారు.