మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ SI నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నస్పూర్ ఆక్స్ఫర్డ్ హైస్కూల్ విద్యార్థులకు షీ టీమ్, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. విద్యార్థులకు పోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, షీ టీమ్ లపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా షీ టీమ్ ఇంఛార్జ్ SI ఉషారాణి పాల్గొన్నారు.