ADB: నేరడిగొండ మండలంలోని బుద్ధికొండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పరమహంస శబరిమాత వార్షికోత్సవ కార్యక్రమాన్ని గ్రామస్తులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న MLA అనిల్ జాదవ్ స్థానికులతో కలిసి పూజా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్తులు సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం గొప్ప విషయమని పేర్కొన్నారు.