HYD: విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. నారాయణగూడలో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ, సురేష్ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ మొండి వైఖరిని నిరసించారు.