VZM: తెర్లాం మండలం నెమలాం, కవిరాయునివలస గ్రామాలలో సోమవారం ఎమ్మెల్యే బేబీ నాయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా ఇప్పటి వరకూ ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతీనెల ఒకటవ తారీఖున పేదలకు, వృద్ధులకు ఆర్ధిక భరోసా ఉండేలా పింఛన్లను సకాలంలో అందిస్తుందన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.