NTR: వేలేరు నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న21 మంది విద్యార్థులు అర్ధరాత్రి సాహసం చేసి సస్పెండయ్యారు. ఆదివారం రాత్రి 10గంటల తర్వాత హాస్టల్లోని ఎగ్జిట్ ఫ్యాన్ బెజ్జం తీసి, చిన్న రంధ్రం గుండా బయటపడ్డారు. హనుమాన్ జంక్షన్- నూజివీడు రోడ్డుకు వెళ్లి బిర్యానీ తెచ్చుకున్న ఈ విద్యార్థులను గుర్తించిన ప్రిన్సిపల్ తీవ్రంగా స్పందించి, వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసారు.