TPT: తిరుపతిలో దారి దోపిడీ దొంగలు పట్టుబడ్డారు. అలిపిరి ఉపాధ్యాయ నగర్లో నవంబర్ 18న శ్రీధర్ అనే వ్యక్తి ఆటో కోసం వేచి ఉన్నాడు. కొందరు మాటల్లో పెట్టి బంగారు చైన్ లాక్కెళ్లాడు. నిందితులు రేణిగుంట కరకంబాడీకి చెందిన మహేష్, జయ లక్ష్మణ్ కుమార్, జాఫర్, ప్రభుదాస్గా గుర్తించి అరెస్టు చేశామని CI రామ కిషోర్ వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.25 వేలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.