ఏలూరు నగరంలోని స్థానిక 2వ డివిజన్ రామానగర్ కాలనీ సాయిబాబా గుడి రోడ్డులో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బడేటి చంటి, నగరపాలక సంస్థ కో-ఆప్షన్స్ సభ్యులు ఎస్. ఎం.ఆర్ పెదబాబు పాల్గొన్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.