PDPL: ప్రతి ఉద్యోగి జీవితంలో, ఉద్యోగ విరమణ తప్పని ఘట్టమని, పలువురు వక్తలు పేర్కొన్నారు. గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కండక్టర్ మణికుమారి శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా డిపోలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె సేవలను అధికారులు, నాయకులు, తోటి ఉద్యోగులు కొనియాడారు. మణికుమారిని ఘనంగా సన్మానించి, భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.