ప్రకాశం: జిల్లా రైతన్నలకు కలెక్టర్ రాజాబాబు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కీలక సూచన చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దిత్వ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. అలాగే 5 రోజులపాటు వరి కోతలను నిలుపుదల చేసుకోవాలని అన్నారు. లేకుంటే ధాన్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.