HYD: గ్రేటర్లో కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు అనారోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు న్యుమోనియా, ఆస్తమా వంటి ముప్పు పొంచిఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులకు గురైతే ముఖంలోని నాడులపై ప్రభావం పడి ముఖం ఒకపక్కకు లాగేసే బెల్స్ పాల్సీ వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలన్నారు.