CTR: చిత్తూరును ఐటీ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందిన 96 మందికి నియామక పత్రాలను అందజేశారు. తరచూ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు.