BHPL: మలహర్రావు మండలం నాగులమ్మ క్రాస్ రోడ్డు నుంచి తాడిచర్ల వరకు, ఇప్పల రోడ్డు నుంచి పెద్దతూండ్ల వరకు R&B రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్దతూండ్ల వద్ద పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రి సమయంలో గుంత కనిపియ్యక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరారు.