సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రిపోర్టు పంపించనందున ఇద్దరు ఎంపీవోలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జగదేవపూర్ ఎంపీవో ఖాజా మోహినోద్దీన్, ములుగు ఎంపీవో కలీంలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రిపోర్టు సరైనది పంపనందున షోకాజ్ జారీ చేసినట్లు తెలిపారు.