TPT: ముంబైకు చెందిన జీన్ బొమ్మాన్జీ దుబాష్ ఛారిటీ ట్రస్ట్ టీటీడీ నిర్వహిస్తున్న శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.50 లక్షలు విరాళంగా అందించింది. ట్రస్ట్ సీఎస్వో చంద్రశేఖర్ కృష్ణమూర్తి ఆలయ అధికారులకు డిమాండ్ డ్రాప్ట్ను అందజేశారు. ఈ విరాళం ద్వారా అనేక మంది భక్తులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.