ATP: గుంతకల్లు మండలం వెంకటం పల్లి గ్రామంలో జరిగే రైతన్న సేవలో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.