Motorola Razr 40: మోటరోల రేజర్ (Motorola Razr ) విభాగంలో కొత్త మరో రెండు మొబైల్స్ తీసుకొచ్చింది. జూన్ 1వ తేదీన మోటరోలా 40 అల్ట్రా, మోటరోలా రేజర్ 40 లాంచ్ కానుంది. స్పెసిఫికేషన్స్ గురించి గీన్ బెంచ్ లీక్ చేసింది. ఈ రెండు కూడా ప్రీమియం ఫోన్లే.. ధర కూడా ఎక్కువే ఉండనుంది. మోటరోల రేజర్ 40 విషయానికి వస్తే స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 1 ఎస్వోసీ మీద పనిచేస్తోంది. 12 జీబీ ర్యామ్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13.. 5జీ వెర్షన్లో ఫోల్డబుల్ మొబైల్ వస్తోంది. 33 వైర్డ్ చార్జీంగ్ ఇచ్చారు.
మొబైల్‌కు ఆక్టా కోర్ చిప్ సెట్ అదనపు బలం కానుంది. రెండు సీపీయూలు పనిచేయడం కలిసి వస్తోంది. చైనాకు చెందిన 3జీ సైట్లో మోటరోల రేజర్ 40 మోడల్‌కు సంబంధించిన డిటైల్స్ ఉన్నాయి. మోటరోలా రేజర్ 40 మొబైల్ ధర రూ.88,400 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Motorola 40 ultra) ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.9 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ ప్లే ఇచ్చారు. ఇన్నర్ పీ ఓలెడ్ డిస్ ప్లే ఉంది. ఈ రెండు కూడా ఎల్ఈడీ డిస్ ప్లే ఇచ్చారు. ఈ మొబైల్ మాత్రం క్వాల్ కామ్ అక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెనరేసన్ 1 ఎస్వోసీ మీద రన్ అవుతోంది.
మోటరోలా రేజర్ 40 అల్ట్రాకు 8 జీబీ ర్యామ్ ఇవ్వగా 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరెజ్ సామర్థ్యం ఉంది. రెండు 13 మెగాపిక్సెల్ కెమెరాలు ఇచ్చారు. సెల్ఫీల కోసం కూడా రెండు కెమెరాలు ఉన్నాయి. 32 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సామర్థ్యం 3800 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ మొబైల్ ధర రివీల్ కాలేదు. రేజర్ 40 కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.