549 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సౌతాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ వేసిన బంతి జైస్వాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని, కీపర్ చేతిలో పడింది. దీంతో 17 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాహుల్కు తోడుగా సాయి సుదర్శన్ క్రీజులోకి వచ్చాడు.