HYD: శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాద ఘటనలో CNG కారు పూర్తిగా దగ్ధం కాగా.. రాత్రి 10 గంటల వరకు కారు అక్కడ ఎందుకు ఉందనే దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ను సేకరించే పనిలో పడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలైన విషయం తెలిసిందే.