NRPT: దేశ ఐక్యతకు అందరం కృషి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోత్సవాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన 4కేరన్లో ఆమె పాల్గొన్నారు. దేశంలోని గొప్ప నాయకుల్లో పటేల్ ఒకరని, దేశాన్ని ఏకం చేయడంలో ఆయన కృషి ఎనలేనిదని కలెక్టర్ కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు.